పుట:మధుర గీతికలు.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



కోడి కొక్కొరో కో యని కూయుచోట
గుజ్జుపొదరిండ్ల పూఁదేనె కురియుచోట
ఎండమావులు మెండుగ నిండుచోట
అన్నతోఁ గూడి వేడ్క నే నాడుకొందు.

ఎండుటాకులు సుడిగాలి నెగురుచోట
వరుస కప్పలు బెక బెక ఆఱచుచోట
ఉదధివీచిక లొండొంటి నొరయుచోట
అన్నతోఁ గూడి వేడ్క నే నాడుకొందు.

పొదల మిణుఁగురుపురుపులు పొదలుచోట
శారికలు కీరములు చేరి చదువుచోట
తరులపువ్వుల గుత్తులు విరియుచోట
అన్నతోఁ గూడి వేడ్క నే నాడుకొందు.

సరసునిండను కలువలు విరియుచోట
పదనుపుప్పొడి కుప్పలై పొదలుచోట
పావురంబులు గుబగుబల్ పలుకుచోట
అన్నతోఁ గూడి వేడ్క నే నాడుకొందు.

10