పుట:మధుర గీతికలు.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



కొంగగుంపులు బారులై కూడుచోట
ఇసుకతిప్పలు మెండుగా నెసఁగుచోట
గుప్పుగుప్పున వడగండ్లు కురియుచోట
అన్నతోఁ గూడి వేడ్క నే నాడుకొందు.

పండు వెన్నెల లెల్లెడ నిండు వేళ
మినుకు మిను కంచు తారలు మెఱయు వేళ
చదల మెఱపులు నాట్యంబు సలుపువేళ
అన్నతోఁ గూడి వేడ్క నే నాడుకొందు.

11