పుట:మధుర గీతికలు.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్న వస్తువులు



చిన్ని మొగ్గను వికసింపకున్న నేమి-
లోప మొక్కింత కలుగునే లోకమునకు ? '
అనుచు మొగ్గలు మూతులు ముణిచెనేని,
చల్లగాడ్పులు గోల్పోవు సౌరభములు
తరువు లెల్ల కళారహితంబు లగును.

చిన్ని చినుకును నే రాలకున్న నేమి...
లోపమొక్కింత కలుగునే లోకమునకు ?'
అనుచు చినుకులు మబ్బుల నణఁగెనేని,
చెఱువు లన్నియు నెండి శుష్కించి పోవు
సస్యములు లేక నశియించు జంతుగణము.

చిన్నిచుక్కను నే నుండకున్న నేమి.
లోప మొక్కింత కలుగునే లోకమునకు ?'
అంచు తారలు దివి నుదయించుకున్న.
చిన్న వోవును గగనంబు చెన్ను తఱిగి
నావ లల్లాడు కడలిలోఁ ద్రోవ తప్పి,

12