పుట:మధుర గీతికలు.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



చిన్నిదివ్వెను నే వెల్గకున్న నేమి-
లోప మించుక కలుగునే లోకమునకు ?'
అనుచు దీపంబు వత్తుల నణఁగెనేని,
చిమ్మచీఁకటి కడలెల్లఁ గ్రమ్మికొనును
లోకమంతయు నల్లకల్లోలమగును.

చిన్నిపిట్టను నే పుట్టకున్న నేమి.
లోప మించుక కలుగునే లోకమునకు?'
అనుచు పక్షులు గ్రుడ్డుల నణఁగెనేని,
కలరవంబులు జగతిలో వెలితివడును
సృష్టి యెల్లను శృంగారహీన మగును.

చిన్నికందును నే పుట్టకున్న నేమి...
లోప మొక్కింత కలుగునే లోకమునకు ?'
అనుచు పసిపాప గర్భమందణఁగెనేని,
ప్రేమ యనునది లోపించు పృథివియందు
క్రమముగా సృష్టియెల్లను సమసిపోవు.

13