పుట:మధుర గీతికలు.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోర్కెలె ఱెక్కలై యలరెనేని



అహహ ! కోర్కెలె ఱెక్కలై యలరెనేని,
రివ్వు రివ్వున వెస నంతరిక్ష మెగసి
చుక్కగమిలోన నే నొక్క చుక్క నగుచు
మినుకుమిను కంచు మెఱయనే మింటిమీఁద?

అహహ ! కోర్కెలె ఱెక్కలై యలరెనేని,
రింగురింగున నొక పెట్ట నింగి కెగసి
ఇంద్రచాపంబు నడుచక్కి నెక్కి లీల
నిలిచి నృత్యంబు సేయనే నిండువేడ్క?

అహహ ! కోర్కెలె ఱెక్కలై యలరెనేని,
రివ్వురివ్వున వడి సంహారిక్ష మెగిసి
తళుకు తొలకరిమెఱపుల త్రాళ్ళు గట్టి
మబ్బుటుయ్యల నూఁగనే యుబ్బు మెఱయ ?

14