పుట:మధుర గీతికలు.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



మిసిమి వెన్నెలయందలి మిసమిసలును
మించు నునుమంచుబిందుల మిలమిలలును
మింట మెఱసెడు చుక్కల మిసమిసలును
చేసె నెవ్వఁడు? దేవుండె చేసెఁ గాక.

ఇంద్రధనువున వన్నెల నెవఁడు నించె
మెఱపుతీఁగల కెవ్వండు మిసిమి పెట్టె?
మబ్బుదొంతర కెవ్వాఁడు మసక గూర్చె:
ఈశుఁడేగాక యిఁక నన్యుఁ డెవఁడు గలడు?