పుట:మధుర గీతికలు.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవుఁడు


విరియు పువ్వుల గుత్తుల పరిమళంబు,
సలలితం బగు పులుఁగుల కలరవంబు,
చిన్ని బిడ్డల చిన్నారి చిఱుతనగవు
చేసె నెవ్వఁడు? దేవుండె చేసెఁ గాక.

మింటి నంటెడు నెత్తైన మేటిగిరులు,
నేల జలజల ప్రవహించు మేలినదులు,
చదలు వన్నెలు వెట్టెడు సంజకెంపు
చేనె నెవ్వఁడు? దేవుండె చేసెఁ గాక.

కమ్మతావుల నెగఁజిమ్ము తెమ్మెరలును,
చల్లఁదనమును వెదజల్లు చందమామ,
తేనెసోనలఁ గురిపించు తీయపండ్లు
చేనె నెవ్వఁడు? దేవుండె చేసెఁ గాక.