పుట:మధుర గీతికలు.pdf/496

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


పూర్వకాలమునం దొక భూవరుండు
భాను చంద్రుల నాకాశపథము నందు.
నిలిపే నంచును వినలేదె? నీవు నట్లే
తలఁచి నంతన అవలీల నిలుపఁగలవు.”

అనుడు. మనమున నుప్పొంగి. అనియెఱేఁడు:
“సచివసత్తమ, నీమాట సత్యమేని,
భాను చంద్రుల నోకచోట పాదుకొలుపఁ
గలనె కలకాల మట్టిట్టు తొలఁగకుండ?

తరణి చంద్రులు నాయాన దాఁటరేని,
ఉబ్బి తబ్సిబ్బు నొందుచు బొబ్బరించి,
నింగి కెగయుచు నేలపై పొంగి పొరలు
జలధి వెనుకకు మరలునే సచివవర్య?'

మంత్రి యిట్లనె, 'గగన భూమండలములు
నీదునానతి తలఁదాల్చి నిలుచు ననఁగ,
అబ్ది వెనుకకు మరలుట యబ్బురంబె
ఇంచు కొకసారి నీవు శాసించితేని!' -

45