పుట:మధుర గీతికలు.pdf/495

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



'ఏలికను బోలు వీరుఁ డీయిలనే కాదు-
మూఁడులోకములందును లేఁ డటంచు
నొక్కి ముమ్మాటికిని మేము నుడువఁగలము'
అనుచు నఱుచిరి పరివారకనులు చేలఁగి .

ఉస్సు రని రాజు లిట్టు నిట్టూర్చి యనియె:
"ఎంత విభవంబు కలిగిన, నేమి సౌఖ్య
మనుభవించితి నిన్నాళ్లు? తనువు సడలె,
ఎపుడు మృత్యువు వచ్చునో యెఱుఁగరాదు.

అంత యేటికి నాదు రాజ్యంబు గోరి
నన్ను తెగటార్పఁ జూతురు నాదుసుతులు
వారిచే నీల్గుకంటె నీవారి రాశి
మేను దొరఁగుట యెంతయు మేలు కాదె?”

"పాపము శమించుఁ గావుత-పలికె నుంత్రి,
“ప్రభుఁడ, ఇట్టి యమంగళవాక్కు, లాడఁ
జనునె? నీమేనిజిగి యింక సడలలేదు;
చల్లగా వెయ్యియేండ్లు వర్థిల్లు మయ్య.

44