పుట:మధుర గీతికలు.pdf/494

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కెన్యూటు చక్రవర్తి



సమరము లొనర్చి, శత్రుల సంహరించి,
కోటలను కూల్చి, పురముల కొల్లఁగొట్టి,
పాలనము చేసె ధారుణిన్ వై భవముగ,
విక్రమంబున 'కెస్యూటు' చక్రవర్తి.

తనదుచేతల కాతండు మనమునందు
కొందలము నొంది, యొకనాఁటి సందెవేళ
అబ్ధితీరము నందు వాహ్యాళి వెడలి
తనదు పరివారజనులతో ననియె నిట్లు:

'భీకరం బగు సైనికవితతిఁ గూర్చి,
వ్యూహములఁ బేర్చి, వైరుల మోహరించి,
భండన మొనర్చి, విజయముల్ బడనాడ!
ఏఁడి నను బోలు వీరుఁ డీ పృథివియందు?'

43