పుట:మధుర గీతికలు.pdf/497

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది





బెడిదముగ నిటు శాసించె పుడమిఱేఁడు:
'ఓ యనంతగభీరపయోధిరాజ!
వినుము, నీ కిదె ఆజ్ఞ గావించుచుంటి,
విశ్వముల నెల్ల పాలించు విభుఁడ నేను,

పావనం బగు మామక పాదయుగళి
నంటఁ బోకుమి, ఇంక నీ యకటవికట
మైన యట్టహాసము లెల్ల మానివైచి,
అంబుధిస్వామి, వేంచేయ మయ్య వేగ.'

ఒడయఁ డీరితి త న్నానయిడుకొలంది,
అంతకంతకు పెనుగర్జ లగ్గలింప
వఱ్ఱు లొడ్డుచు పాఱుచు మిఱ్ఱు బ్రాఁకి
పుడమిమీఁదికి దండెత్తె కడలిఱేఁడు.

భీషణకఠోరరవముల ఘోష లిడుచు
భాసురం బగు ఫేనాట్టహాస మొప్ప
అలలచేతులు నల్లన నల్లలార్చి
తాండవంబాడె వేడ్క రత్నాకరుండు.

46