పుట:మధుర గీతికలు.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


    వికటముగ నవ్వి, తోడనే భృత్యుఁ డనియె;
   'అహహ! దేవర యెంత మాటాడినారు :
    మీరలో ? -' 'నేను నేలపైఁ గూరుచుంటి'
    ననుచు బదులిడె గొణుగుచు మనుజవిభుఁడు.

3. “ నీచు నుచ్చుని, ఉచ్చుని నీచునిఁగను,
    సేవకుని రాజు, రాజును సేవకునిఁగ
    చిటికలో తాఱుమాఱుగ చేయుచుండు
    చిత్రముగ దేవుఁ, డిదె వానిసృష్టిమహిమ.'

    అనుచు వచియించి, భటుఁడు సింహాసనంబు
    తోడనే డిగ్గి కేలోయి దోయిలించి,
    ప్రభువతంసమ : మీ మూఁడు ప్రశ్నములకు
    నుత్తరంబులు చెప్పితి యుక్తి మెఱయ;

    శిరము తఱిఁగింతురో, లేక శిరమునిండ
    గుమ్మరింతురో ధనరాశి కూర్మి మీఱ ?
    నాధ : మీచిత్త, మవ్వల నాదు భాగ్య
    మెట్టులున్నదొ యట్లు చేయింపు డయ్య."

44