పుట:మధుర గీతికలు.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


1. " వినుము భూవర పాలలో నణఁగియుండి
     వెన్న యంతట నిండారియున్నయట్లు,
     ఈశుఁ డొకచోట నుండియు నెల్లయెడల
     నిండి నిబిడీకృతుఁ డయి యుండుఁ జువ్వె.”

     దివ్వె వెలిఁగించి భటుఁ డంత, 'దీని కాంతి
     అధిప! ఏదెస నున్నది?' యనుచు నడిగె;
     అన్ని దిక్కుల వెలుఁగుచునున్న' దనుచు
     ఱేడు బదులిడె, భృత్యుఁ డీరీతి ననియె.

2. "దివ్వె యొకచోట నుండియు, దిశల నెల్ల,
     నిండుకాంతిఁ బ్రకాశించుచుండురీతి,
     ఈశుఁ డొకవైపు చూచియు, నెల్లదెసల
     నొక్కసారిగఁ జూచుచునుండు ఱేఁడ!"

     అనుచు క్రమ్మఱ ధరణినాయకుని జూచి
    'ఇప్పు డే నెట నుంటినో చెప్పుఁ' డనుచు
     నతఁడు ప్రశ్నింప, 'నాదుసింహాసనంబు
     నందు కూర్చుంటి' వని చెప్పె నవనివిభుఁడు.

43