పుట:మధుర గీతికలు.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


చింకిగుడ్డలు, తల పైని వంకపాగ,
కేల గునుపులకఱ్ఱను లీలఁ దాల్చి
కట్టెదుట నున్న సేవకుఁ గాంచి రాజు
అచ్చెరువునొంది, ‘నీ వేల వచ్చితి ' వనె.

"భూవరా! నీయమాత్యుని సేవకుండ,
వ్యాధిచే నాదు నేలిక బాధపడుచు
లేవఁజాలక న న్నంప, దేవ! మీదు
ప్రశ్నముల కుత్తరము లీయ వచ్చినాఁడ."

సేవకుం డిట్లు వచియింప, భూవరుండు
పలికె, “ఎవరైన నేమి నా ప్రశ్నములకు
ఉత్తరము చెప్పవలయు, లేకున్న నతఁడు
ఉసురు గోల్పోవ సిద్ధమై యుండవలయు.”

అనుడు, నారాజుపలుకుల కనియె భటుఁడు:
"ఉత్తరము చెప్పుటకు పూర్వ మొక్కమాట
విన్న వించెద, నది విన్న పిదప, మీదు
చిత్తమునకు నచ్చినట్టులు చేయవచ్చు.

41