పుట:మధుర గీతికలు.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


3. ఇంక నొక ప్రశ్న యడిగెద - ఎట్లతండు
నీచు నుచ్చుని, ఉచ్చుని నీచునిఁగను,
సేవకుని రాజు, రాజును సేవకునిఁగను
చిత్రముగ నొక్కతృటిలోన చేయఁగలడు ?

పదిదినంబులు గడు విత్తు, ప్రశ్నములకు
నుత్తరంబుల నందాక నొసఁగవేని,
నీదుశిరమును ఖండింతు నిశ్చయముగ”
అనుచు వచియించె నాతండు వ్యగ్రుఁ డగుచు.

ప్రభుఁడు పలికిన యాఘోరవాక్యములకు
మాఱు మాటాడఁజాలక మంత్రివరుఁడు
చిత్తమున కొంత ధైర్యంబు చిక్కఁబట్టి
సరియె' యని పల్కి, యింటికిఁ జనియె వేగ.

దీనుఁడై యున్న తన యజమానుఁ జూచి
చింత నొందుచు నాతని సేవకుండు
కారణ మెఱింగి మంత్రిని నూరడించి
గడువునాఁటికి నారాజుకడకుఁ జనియె.

40