పుట:మధుర గీతికలు.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూఁడు ప్రశ్నలు


పాటలీపుత్ర మను నొక్క పట్టణమున
పరమనాస్తికుఁ డగు నొక్క ప్రభువు గలఁడు;
కొలువులో నాతఁ డొకనాఁడు కూరుచుండి
తనదుమంత్రిని పిలిపించి, అనియె నిట్లు:

"దీర్ఘకాలమునుండి బాధించుచుండె
సంశయంబులు మూఁడు నాస్వాంతమందు,
వాని నన్నిటిఁ దీర్చి సత్వరమె నన్ను
సదమలాత్మునిఁ జేయుమా సచివవర్య!

1. ఈశుఁ డొకచోట నుండిన; నెట్లతండు
నిఖిలజగములయం దెల్ల నిండియుండు ?
2. ఆతఁ డొకవైపు చూచిన, అఖిలదిశలు
కలయ నొకసారి యేరీతిఁ గాంచగలఁడు ?

39