పుట:మధుర గీతికలు.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


“సరియె మంచిది, మీరలు సలుపరాని
పనుల నియమించి మిము శ్రమపఱుప నేల ?
నేనె స్వయముగ దూడను నెమకికొందు
కాన పల్లకి మోయుఁ” డం చానతిచ్చె.

ఇట్లు వచియించి, పల్లకి నెక్కి కాఁపు
దారుణం బగు నాఁటిమధ్యాహ్న వేళ
చౌటిపఱ్ఱల, పొలముల, తోట దొడ్ల,
సందుగొందుల: ద్రిప్పించె నందల౦బు.

మండుటెండల మలమల మాడి మాడి
వేసటంబడి బోయలు గాసినొంది
“అయ్య ! మే మింక నొకయడు గైన నకట
మోప లే” మని మొఱవెట్ట, కాఁపువాఁడు.

“అందలము మోయుపని మీది, ఆవుదూడ
రోయుపని నాది కావున బోయలార !
అందలము మీరు మోయుఁడి, ఆవుదూడ
వెదకికొందును నే" నని బదులు పలికె.

29