పుట:మధుర గీతికలు.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాఁపువాఁడు - బోయీలు



కలఁ డొకానొకపురమున కాఁపువాఁడు;
వానియాఁబెయ్య యొకనాఁడు పాఱిపోవ,
పల్లకీమోయు చాకలివాండ్రఁ బిలిచి
వెదకితెం డని వారికి ముదలవెట్టె.

“అందలము మోయుపని కాని, ఆవుదూడ
వెదకుపని మాది కా" దని బెదరు లేక
పొగరుఁబోతుతనంబున బోయ లంత
బదులుపల్కిరి యాకాఁపువానితోడ.

బోయ లాడినమాట కబ్బురము జెంది
'ఔర ? వీరల కింతటి యాగడంబ ?
మూర్ఖు లగు వీరి కెటు లైన బుద్ది సెప్పి
గర్వ మడఁచెదఁగా' కంచు కాఁపువాఁడు.

28