పుట:మధుర గీతికలు.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఎదురుగా వచ్చి రాపులుఁ గిట్టు లనియె:
“అవుర ! యెంతటి మోసకాఁడవుర నీవు ?
మంచిమాటల నన్ను నమ్మంగఁ బలికి
నాదుబిడ్డలఁ జంపంగ న్యాయ మగునె ?"

“నీదుబిడ్డలు లే విందు నిక్కముగను,
నేఁడు చంపిన పిట్టలన్నింటియందు
అంద మగు పిట్ట యొక్కటి యైన లేదు;
నీవె చూడుము నామాట నిజమొ, కాదొ?"

“ఇంతమాత్రమె మూర్ఖుఁడా యెఱుఁగవై తి,
వవనియందలి సర్వవస్తువులలోన
తనదుబిడ్డలె యధిక సౌదర్యవంతు
లనుచు మనమునఁ ధలఁపని జనని గలదె ?”

27