పుట:మధుర గీతికలు.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఫక్కు మని నవ్వి యతనితో పక్కి యనియె;
“ఔర ; మృగయుఁడ ! యెంత మాటాడినావు ;
పులుఁగుజాతుల నిన్నాళ్లు మెలఁగుచుండి
అడిగెదవె నాదుబిడ్డల యానవాలు ?

“జగములందలి బహువిధఖగము లెల్ల
నాదుబిడ్డలతోడ సౌందర్యమందు
సాటివచ్చునె ? కాన నోవేఁటకాఁడ !
వాని నవలీల పోల్చఁగవచ్చు నీకు.”

పెక్కుమాట లిఁ కేల ? ఓపక్కిఱేఁడ ?
వినుము చెప్పెద - నీబిడ్డ లనఁగ నేల?
సుందరం బగు పక్షులజోలిఁ బోవ
నంచు నే ని దె బాస గావించువాఁడ.”

అనుచు వచియించి యాతఁడు వనములోని
కేగి, దిన మెల్ల పక్షుల నెన్నొ కూల్చి,
వాని నన్నిఁటి నొకత్రాట వరుసఁ గూర్చి
తరలి వచ్చుచునుండె నాదారివెంట.

26