పుట:మధుర గీతికలు.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేటకాఁడు - రాబందు


వేఁటకుక్కలు డేగలు వెంట రాఁగ,
వెడలె కానకు నొకనాఁడు వేఁటకాఁడు;
అంత నతఁ డేగెనో లేదొ కొంతదవ్వు,
దారిలో నొక్క రాబందు తారసిల్లి.

“అయ్య మృగయుఁడ ! నీవు వేఁటాడునపుడు
నాదుబిడ్డలలో నీకు నేది యైన
కానిసించిన, చంపక కాతు ననుచు
అభయహస్త మొసంగుమా ?” అనుచు వేఁడె.

అంత నాతఁడు పక్షితో ననియె నిట్లు :
“అట్టులే కాని, నీబిడ్డ లనుచు నేను
గుఱుతుపట్టుట యెట్టులో యెఱుఁగఁజాల'
కాన చెప్పుమ యేదేని యానవాలు.”

25