పుట:మధుర గీతికలు.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


“అమ్మ ! వింటివె పొలముకాపన్నమాట ?
నిలువవచ్చునె మన మిందు నిముస మైన?
ప్రొద్దుపుచ్చితి మిన్నాళ్లు ముదము మీఱ,
ఎందు బోవుదు మక్కటా ! ఇప్పు డింక ?"

అనుచు పిల్లలు వచియింప, అనియె తల్లి:
“ఇందె యుందము, అప్పుడే తొంద రేల ?
రేపే జరుగవు కోతలు, కాఁపువాఁడు
ఒరులసాయ మపేక్షించియుండెఁ గాన.”

కడచె కొన్నాళ్లు; మరల నాకాఁపువాఁడు
పొలమునకు వచ్చి వచియించె పుత్రుతోడ :
“ఒరులపైఁ బెట్టి మన మింక నుండఁ దగునె ?
నేఁడే కోతము స్వయముగ నీవు నేనె.”

అంత పిల్లలతో నిట్లులనియె తల్లి:
“గడియ యైనను మన మింక తడయరాదు;
పరులసాయంబు లేకయె స్వయముగానె
కార్య మొనరింప సమకట్టె కాపువాఁడు.

23