పుట:మధుర గీతికలు.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పక్షి - వరిపొలము


ఊరివెలుపల, నొక సెలయేఱుదరిని
పండఁబాఱిన పొలమందు, పక్షి యొకటి
గూటిలోఁ దాను పిల్లలు గూడిమాడి
కాపురము చేయుచుండె సౌఖ్యంబు మీఱ.

చంచువుల గింజ లిరికించికొంచు పక్షి
ప్రేమతో కందువులఁ దినిపించుచుండె;
అపుడె మొలచిన ఱెక్క లల్లార్చికొనుచు
కొదమపులుఁగులు కిలకిల కూయుచుండె.

అంత నచటికి పొలముకా పరుగుదెంచి.
తనదుపుత్రునితో నిట్టులనియె : “కుఱ్ఱ!
పండె పొల మెల్ల, నిఁక తడ వుండరాదు,
కాపు లందఱ బిలిపింతు రేపె కోయ.”

22