పుట:మధుర గీతికలు.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పిసినివాఁడు - పసిఁడిమూట


ఊరివెలుపల, పాడుకోనేటిచెంత,
మనుజు లెవ్వరు మసలని మాఱుమూల,
గుట్టుచాటున లోతైన గోయి త్రవ్వి
పసిఁడి దాఁచెను పిసినారిముసలి యొకఁడు.

ప్రతిదినంబును వృద్ధుండు పాతు త్రవ్వి
మురిసిపడుచుండు బంగారుముద్ద జూచి;
పొదలమాటున నది యెల్ల పొంచి చూచి
దొంగ యొక్కఁడు సర్వంబు దోచికొనియె.

మఱుదినంబున ముసలివాఁ డరుగుదెంచి
గోయి త్రవ్వంగ బంగారు మాయ మయ్యె;
నెత్తి నోరును లబలబ మొ త్తికొనుచు
గొల్లు మని యేడ్చి యతఁడు గగ్గోలువెట్టె.

19