పుట:మధుర గీతికలు.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


“కాటి కొకకాలు సాఁచియు కాపువాఁడు
ఉట్టికట్టుక కలకాల మూఁగులాడ
నెంచెఁ గాఁబోలు, లేకున్న నిట్టిపనికిఁ
బూని కాలంబు రిత్తగాఁ బుచ్చనేల ?”

నృపునిమాటల నాలించి వృద్ధుఁ డనియె;
“చెట్లఫలముల తిన నపేక్షించి కాదు,
మున్ను మనపెద్ద లందఱు చన్నరీతి
ఆచరించితి నంతియె అవనినాథ !

“వారు నాఁటిన వృక్షముల్‌ ఫలము లీన,
అనుభవించుట లే దొకో మనము నేఁడు :
అట్లె, మన మిప్డు నాఁటిన చెట్లఫలము
లనుభవింతురు గద ? మనతనయు అవల.”

అంత నా రాజు ముసలివాఁ డాడినట్టి
పలుకులకు నాత్మ నెంతయు ప్రమద మంది,
గౌరవము మీఱ నాతని గారవించె
ఏడుబంగారుకాసుల నెలమి నొసఁగి.

17