పుట:మధుర గీతికలు.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బాటసారులు = ఎలుగుగొడ్డు.


చిట్టిచీమయు చొరరాని దట్టమైన
దారుణం బగు నొక్క కాంతారమందు
రాత్రివేళను భీముఁడు, రాముఁ డనెడు
పాంథు లిరువురు కాల్నడఁ బయన మైరి.

రాముఁ డి ట్లని వచియించె భీముతోడ;
“దారిలో నేది యైనను క్రూరమృగము
ఎదురుగా వచ్చి మనపైని గదిసె నేని,
ఏమి చేయుద ?” మనవుడు భీముఁ డనియె:

“ఏను నీచెంత నుండ నీ కేమిభయము?
ఎన్ని గుండెలు గలవు నే నున్నచోట
ఘాతుకమృగంబు కదియంగ? కదిసె నేని
చించి చెండాడనే యొక్క చిటికలోన ?”

13