పుట:మధుర గీతికలు.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఆతఁ డిట్లనియెనో లేదొ - అంతలోనె,
ఎచటనుండియొ యొక పెద్ద యెలు గుగొడ్డు
గుఱ్ఱుగుఱ్ఱున సటలెత్తి ఘుర్ఘురించి
పరుగువాఱుచు నాచెంత కరుగుదెంచె.

జల్లుజల్లున నొడలెల్ల జలదరింప
తనదుమిత్రునిమాటయె తల పు గొనక,
పిక్కసత్తువ చూపించి భీముఁ డంత
తరువుమీఁదికి గుప్పించె సరభసమున.

ఏమి చేయంగఁ దోచకఁ రాముఁ డంత
చాపకట్టుగ నేలపై సాగిలఁబడి
కాలుసేతుల నట్టిట్టు కదపకుండ
ఊర్పు బిగఁబట్టీ చచ్చినయోజ నుండె.

అంత భల్లూక మాతనిచెంతఁ గదిసి
ముక్కు నోరును చెవులును మూరుకొనుచు
'చచ్చి యెన్నఁడొ చివికిన శవ మి దేల?'
అనుచు నాతని‌ విడనాడి యవలఁ జనియె.

14