పుట:మధుర గీతికలు.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


అంత పడవాలు గ్రుక్కుమిక్కనఁగ లేక
చిత్తరువురీతి నిలఁబడె చేష్ట లుడిఁగి;
'సెల వొసంగుఁడు పోయివచ్చెద' నటంచు
చనియె తెరువరి వేగ నశ్వంబు నెక్కి.