పుట:మధుర గీతికలు.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాషింగుటన్‌


పాంథుఁ డొక్కఁడు పట్టణపరిసరమున
హయముపై నెక్కి యెచటికో అరుగుచుండె;
ఊరివెలుపల కొందఱు యుద్ధభటులు
త్రోయుచుండిరి బరువైన దూల మొకటి.

బలిమిమై వార లందఱు పట్టి పెనఁగి
అదిమి లాగిన దూలంబు కదల దయ్యె;
'పట్టుఁ, డెత్తుఁడు, నెట్టుఁడు, కట్టి లాగుఁ'
డంచు నొక్కఁడు వారి గద్దించుచుండె.

పథికుఁ డది చూచి వానితోఁ బలికె నిట్లు :
'అయ్య ! ఇటు చేయుఁ డటు సేయుఁ డంచు నిల్చి
నుడువుకం టెను నీవును నడుముకట్టి
సాయ మొనరించి కార్యంబు చేయరాదె ?"

10