పుట:మధుర గీతికలు.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


'లీల జగముల నెల్లఁ గల్పించినట్టి'
సృష్టికర్తకె యీరీతి చెట్ట నగుచు
పంగనామము పెట్ట గడంగినాఁడ;
ఎట్టిసాహసమున కొడిగట్టికొంటి ?

అల్పబుద్ధిని నే నేడ? అఖిలసృష్టి
మించి సృజియించి పాలించి త్రుంచునట్టి
అఖిలశ క్తి నియామకుండాఁత డేడ ?'
అనుచుఁ జింతించె నాతండు మనమునందు