పుట:మధుర గీతికలు.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


'ఔర ! సర్వజ్ఞుఁ డని పెద్దపేరె కాని
బమ్మ యొనరించు సృష్టిజాలమ్మునందు
అకటవికటము కానట్టి దొకటి కలదె?
బుద్ధి పెడతలఁ బట్టెఁ బో వృద్ధుఁ డగుట,

'అట్టె తా నొకనేర్పరి యయ్యెనేని
పెద్దచెట్టున కనువైన పెద్దపండ్లు
చిన్నచెట్టున కనువైన చిన్నవండ్లు
కూర్ప నగుఁ గాని ఈతాఱుమార్పు లేల ?'

అనుచు నీరీతి తలపోసికొనుచు నంత
కొంతసేపటి కాతండు కూర్కు జెందె;
గాలి కిట్టట్టు కొమ్మలు కదలియాడ
మఱ్ఱికాయలు పడె వానిబుఱ్ఱపైని.

దద్దఱిలి లేచి తనతల తడవికొనుచు
అయయొ ? ఇవ్వియె పెద్దపం డ్లయ్యె నేని
బళ్ళు మంచును నాతల బ్రద్ద లగుచు
యమునివాకిట ప్రాఁతకాపగుదుఁ గాదె ?

8