పుట:మధుర గీతికలు.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అల్పజంతువులు


సమరతలమున నోడి రాకొమరుఁ డొకఁడు
అరులు చెలరేగి తన్ను వెన్నంటి తఱుమ,
వడిగఁ బరుగెత్తి యొక్క కారడవిఁ జేరి
వృక్షములచాయ నించుక విశ్రమించె.

బడలికలు వాయ నొక్కింత తడ వతండు
నిద్రవో నెంచి చేలంబు నేలఁ బఱవ,
చీమలును సాలెపురుగులు చేరి, వాని
పాన్పుపైఁ బ్రాఁకి చీకాకుపఱచె మిగుల.

‘మాలదైవము కటకటా ఏల కూర్చె
క్షుద్రజంతుల మనుజులనిద్ర చెఱుప ?
శత్రువులబాధ నెటు లైన సైపవచ్చు.
వీనిబాధల సైప నెవ్వానివశము ?'

3