పుట:మధుర గీతికలు.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


అఖిలభోగభాగ్యంబుల కాకరంబు,
సకల కల్యాణముల కెల్ల జన్మభూమి,
భవ్యసుఖములు కెల్లను పట్టుకొమ్మ;
గృహముకంటెను సౌఖ్యంబు మహిని గలదె?

కామితంబుల నొనఁగూర్చు కల్పతరువు,
ఊర్జితం బగు శుభముల కునికిపట్టు,
వరమసంతోషముల కెల్ల పంటచేను;
గృహముకంటెను సౌఖ్యంబు మహిని గలదె?