పుట:మధుర గీతికలు.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



లీల మి న్నను మున్నీటఁ దేలియాడు
గొప్పము త్తెంపుచిప్ప నా నొప్పె విధుఁడు;
అవల చిందిన యాణిముత్యంబు లనఁగ
తళుకుతళుకున మెరయుచు తార లలరె.

అంబరం బను నీలివస్త్రంబు పైని
గట్టిగారుబ్బి ప్రోవిడి పెట్టినట్టి
సగ్గుబియ్యపుముద్ద నా చంద్రుఁ డలరె:
పిండివడియంబు లన చుక్కపిండు లొప్పె.

పండువెన్నెల పేరిటి పాలకడలి
యందు నడుచక్కి జాబిల్లి యంద మొంద.
కడలితరగలపైఁ దేలి కదలియాడు
గండుమీనులొ యన చుక్క పిండు లొప్పె.

38