పుట:మధుర గీతికలు.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


కాల మనుకాపు మి న్నను నేలయందు
చిలుపవెన్నెలజలముల చిలుకరించి
నిండుచందురుఁ డను దృష్టికుండ నిలిపి
చక్కగా నాఁటు పై రన చుక్క లలరె.

చదలుప్రమిదను తిమిరంపుచమురు పోసి
వేడ్క మీఁఱగ వేలుపుపేరటాండ్రు
నోచిరో లక్షవత్తుల నో మనంగ,
విమలకాంతుల చుక్కలు వెలిఁగె దివిని.

చందురుం డను వెండికంచంబునందు
అమరులమృతంపాయస మారగింప,
చుట్టు చిందిన మెతుకులయట్టిలీల
సలలితంబుగ తారకావళులు వెలసె.

అంబరం బను పందిరియందునుండి
పండి రాలిన గుమ్మడిపండొ యనఁగ,
తరణికూలఁగఁ అందుండి తొరఁగి రాలు
గింజలో యన నక్షత్రపుంజ మొప్పె.

37