పుట:మధుర గీతికలు.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నక్షత్రములు


పట్టునీలంపుబట్టపై కుట్టినట్టి
వెండిజలతారు పువ్వుల విధము దోఁప,
కనులపండువు చేయుచు గగనమందు
మిసుకుమిను కంచు తారలు మెఱయుచుండె.

వేడ్క యామినీసోముల పెండ్లి వేళ
ఆకసం బను పందిరి యందుఁ గట్టు
బాగు మీఱిన తెల్లని పాదరసపు
గుండులో యన, చుక్కలపిండు లొప్పె.

విమల మందాకినీనదీ వీచికలను
తేలి తూఁగాడు బుడగల చాలు లీల.
దట్ట మగు పండు వెన్నెల నట్టనడుమ
మినుకుమిను కంచు చుక్కలు మెఱయుచుండె.

36