పుట:మధుర గీతికలు.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గొల్లకన్నె


ఎందుఁ బోవుచునుంటివే సుందరాంగి ?'
పాలు పితుకంగ నేగెద పడుచువాఁడ!
వత్తునా నేను నీవెంట వన్నెలాడి?'
ఇచ్చ గలదేని రావచ్చు నెమ్మెకాఁడ'

పెండ్లియాడెదవే నన్ను పిన్నదాన?'
కులముపెద్దల నడుగుమో కుఱ్ఱవాఁడ! '
తండ్రి యెవ్వఁడె నీకు నోతరుణిమిన్న'
పల్లెలోనున్న పెదకాఁపు పిల్లవాఁడ!

ఏమిభాగ్యంబు గలదాన వీవు చాన?'
వాలుఁగన్నులె నాపాలి భాగ్య మయ్య:'
అట్టులైనను నిన్ను పెండ్లి యాడ బాల'
ఎవ్వ రడిగిరి? నీదారి నీవు పొమ్ము.'

35