పుట:మధుర గీతికలు.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఐన తెలిపెద దీనిరహస్య మెల్ల -
ఇదిగో మొదటిది, రెండవ దిదిగో చూడు,
ఒక్కటియు రెండు కలిసిన నిక్కముగను
మూడని యెఱుంగు నెంతటి మూఢు డైన.”

అన్న మూ డన, తాను రెం డనఁగ, నిట్లు
జరగె వాదము; వానితోఁ జాలలేక
అంత మాధవి రోదన మాలపించె;
వచ్చె నచ్చటి కింతలో వారితండ్రి.

వికటముగ నవ్వి రాముఁ డావివర మెల్ల
తండ్రితోఁ జెప్పె; నంత నాతండు పలికె
"మేలు రాముఁడః నీబుద్ది మెచ్చినాఁడ;
మూడుపండులె, నిక్కంబు- మూడుపండ్లె

ముద్దు చెల్లెలి కిచ్చెద మొదటిఫలము
ఎలమిఁ గైకొందు రెండవఫలము నేను.
మూడవఫలంబు నీయది ముద్దుకుఱ్ఱ :
కాంక్షదీఱ భుజింపుము కడుపునిండ."