పుట:మధుర గీతికలు.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గడుసు రాముఁడు


గడుసురాముఁడు పదియేండ్ల పడుచువాఁడు,
మంచిబాలకుఁడే కాని మంకువాఁడు;
తనదుచెల్లెలి చిన్ని మాధవిని బట్టి
పీడ చేయుట వానికి క్రీడ యెపుడు.

ఆతఁ డొకనాఁడు తనరెండుచేతులందు
రెండుమామిడిపండ్ల ధరించి, వేగ
తనదు చెలియలికడ కేగి, అనియె నిట్లు:
"మాధవీ! చూడుమిదె మూడుమావిపఁడ్లు,"

“అన్న! ఇది యేమి- మూడుపండ్లనెద వేల ?
రెండుపండులె కన్పట్టుచుండ" ననుచు
పలికె మాధవి. “మాయురే: బాల వీవు,
శక్యమే నీకు గణితశాస్త్రంబు తెలియ ?

33