పుట:మధుర గీతికలు.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ వు


తనదు వత్సంబు కానక వనమువెంటఁ
దిరిగి, అంబే యటంచును దిక్కులెల్ల
మాఱుమ్రోగఁగ నఱచెడు మాతకూయి,
గఱికిపఱకల నెడనెడఁ గొఱకికొనుచు
పొంతపొలముల మేయుచు గంతులిడుచు
నాడుచున్నట్టి యాఁబెయ్య యాలకించి,
చెంగుచెంగునఁ బరుగెత్తి చెంత కేగి
ముట్టెతోడను పొదు గంటి యట్టె పొడువ,
తనువు పులకెత్త నయ్యావు చనులు చేపి
కుంభధారగ క్షీరముల్ కురియఁజేసి
కడుపునిండఁగ దూడను కుడువనిచ్చి,
ప్రేమ పొంగార దానిశరీర మెల్ల
మెల్ల మెల్లన నాకుచు నుల్లసిల్లె.

39