పుట:మధుర గీతికలు.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


"కుతుకబంటిగ తేనియల్ గ్రోలుచుంటి
ఆటలాడుటకే కాదు, మాటలాడ
నైనతీరిక లే దిప్పు” డనుచుఁ బలికి
వ్రాలె తుమ్మెద వేఱొక్క పూలగుత్తి.

సోముఁ డంతట నొక గండుచీమఁ జూచి
"ఎచట కేగెదు చీమ! యొక్కింత నిలుము,
ఆడుకొన నీవు వత్తువే వేడు కలర ?"
అనగ, నాచీమ యతనితో ననియె నిట్లు.

"నూక లొక్కటియొకటిగ నోటఁ గఱచి
కూర్చుకొనుచుంటి బాలుఁడా! గూటిలోకి;
మాటలాడిన గింజలు నోటజాఱు,
ఆటలాడఁగ నా కెట్టు లనువుపడును"

సోముఁ డిట్లని తలపోనె 'చీమ మొదలు
జగములోపలఁ గల జంతుజాల మెల్ల
పాటుపడుచుండ, నక్కటా! వ్యర్థముగను
గడపిపుచ్చితి నిన్నాళ్ళు కాల మెల్ల.'

31