పుట:మధుర గీతికలు.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


"త్వరగఁ బోవలె నిపుడు నాస్వామికడకు,
వేఁటకై వాఁడు నాకయి వేచియుండు,
అదను కా దిది నీతోడ నాటలాడ;"
అనుచు నాకుక్క తన దారిఁ జనియె నంత.

గడ్డిపోచల ముక్కునఁ గఱచికొనుచు
వడిగ నెగురుచునున్నట్టి వాయసమును
కాంచి, యిట్లనె బాలుండు: "కాకి: రమ్ము
వేడు కలరఁగ నాతోడ నాడుకొనఁగ."

ఆటలాడఁగ నా కింత వ్యవధి లేదు
వానకాలము రానుండె, గాన నిపుడె
గూడు కట్టంగవలయు నోకుఱ్ఱవాఁడ!"
అనుచు వచియించి కాకంబు చనియె నెటకొ.

విరియఁబూచిన కుసుమమంజరులపైని
తేనె లానంగ వాలిన తేఁటిఁ జూచి,
బాలుఁ డిట్లనె: "నాతోడ బాళి మీఱ
ఆటలాడఁగ వత్తువే తేఁటి నీవు? "

30