పుట:మధుర గీతికలు.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సోమరి సోముఁడు


బాలుఁ డొక్కఁడు కలఁ డొకపట్టణమున,
వాని నిజనామ మేదొ యెవ్వరు నెఱుంగ;
రతఁడు సోమరిబాలకుం డగుటఁజేసి
సోముఁ డని బాలు రెల్లరు నామ మిడిరి.

ఆతఁ డొకనాఁడు బడిలోని కరుగ మాని
ఆటలాడఁగఁ జనె నొక్కతోఁటలోకి;
కడమబాలకు లెల్లరు బడికిఁ బోవ,
వానితో నాడలేఁ దొక్కబాలకుండు.

వేగ నాదారిఁ జనుచున్న జాగిలమును
పిలిచి సోముఁడు "భైరవా! నిలువు మయ్య
వేడుకలు మీఱ నాతోడ నాడుకొనఁగ,
వత్తువే?” యన, అనె నది వానితోడ

29