పుట:మధుర గీతికలు.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఎన్నరానట్టి దుర్భాష లెన్ని యేని
కూసె నంతట నా వెఱ్ఱికుఱ్ఱవాఁడు;
ఆతఁ డాడిన దుర్భాష లన్ని వరుస
వినఁబడియె నంత నొకదాని వెనుక నొకటి.

పట్టఁజాలని యీసుచే బాలకుండు
కనులు జలజల బాష్పముల్ కాల్వగట్ట.
వేగ బరుగెత్తి గృహమున కేగుదెంచి
జరిగినది యెల్ల వచియించె జననితోడ.

అంత నాతనితో నిట్టు లనియె తల్లి.
"అనుగుబిడ్డఁడ! నేఁడు నీ వాడినట్టి
భాషణంబులె క్రమ్మర ప్రతిరవించె,
నింద యొనరించుకొంటివి నిన్ను నీవె".

" పరుల దూషణవాక్యముల్ పలికితేని,
వారు దూషణవాక్యముల్ పలుకుచుంద్రు:
మంచిమాటలు నీవు వచించితేని,
మంచిమాటలె వారు వచించుచుంద్రు."

28