పుట:మధుర గీతికలు.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర తి ధ్వని


'అరరె! అయ్యారె! హైసరే!' అనుచు నఱచె
కొండగుహచెంత నొకగొల్ల కుఱ్ఱవాఁడు;
'అరరె! అయ్యారె! హైసరే!' అనుచు ధ్వనులు
మరల వినఁబడె కొండగహ్వరమునుండి.

'ఎవ్వ రచ్చట? ఎవ రది? ఎవ్వ?' రనుచు
అఱచె బాలుండు మరల నబ్బురముతోడ;
'ఎవ్వ రచ్చట? ఎవ రది? ఎవ్వ?' రనుచు
మరల నాధ్వని దిక్కుల మాఱుమ్రోఁగె.

'నోరు మూయుము, జాగ్రత్త- నోరు మూయు'
మనుచు గట్టిగ నాబాలుఁ డఱచె నంత;
'నోరు మూయుము, జాగ్రత్త- నోరు మూయు'
మనుచు నాధ్వని వినఁబడె నంత మగుడ.