పుట:మధుర గీతికలు.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


చిన్ని కూనరొ: నీ వందు చేరకమ్మ.
మందిరము కాదు, మనపాలి బందె కాని
అందు చొర నేల ఇడుమల నొంద నేల ?
ఇందె యుందము, మనకేల మందిరములు?"

తల్లి యీరీతి వచియింప, పిల్ల యెలుక
మొగము చిట్లించికొనియుండె మూల నొదిఁగి;
'అమ్మ యిటనుండి యావలి కరిగినపుడు
అందుఁ జొచ్చెదఁ గా కేమి!' యనుచుఁ దలఁచె.

తల్లి నిదురించె, అంత నాపిల్లయెలుక
సం దిదే యని చొచ్చెనామందిరంబు;
టక్కు మని మీట యంతట నొక్కువడియె,
చిక్కుకొనే లోన పాప మాచిన్నియెలుక.

26