పుట:మధుర గీతికలు.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎలుకలబోను


“అమ్మ! నే నిటునటు తిరుగాడుచుండ
కాంచితిని నేఁడు కన్నులకఱవు దీఱ
సుందరంబగు నొక చిన్న మందిరంబు;
దాని సొగసును వర్ణింపఁ దరమె నాకు?

“చుట్టుతీగలు, ద్వారంబు నట్టనడుమ
గలిగి, ఆయిల్లు ముచ్చట గొలుపుచుండె,
అహహ! మఱచితి లోన వ్రేలాడుచుండె,
జున్ను కాఁబోలు- మిసిమిగా నున్న దమ్మ.

అందు నివసింపఁగా రారె హాయి మీఱ ?
జున్నుముద్దల కడుపార జుఱ్ఱవచ్చు,
ఇరుకుబొరియలలో నుండ నేల ?" అనుచు
తల్లితోఁ జెప్పె నొకనాఁడు పిల్ల యెలుక.

25