పుట:మధుర గీతికలు.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


అనుచు వచియించి, ముక్కుతో ఆకు చిదిమి
సూటిగా చీమ యున్నట్టి చోట వైచె;
అంత నాచీమ మెల్లగా నాకు చెంత
కీది, మీఁదికి నెగఁబ్రాకి, సేదదేఱి

బళిర! ఎంతటి చక్కని పడవ దొరకె
చిలుక: నీమేలు మఱవంగఁగలనె?" యనుచు
తేలియాడెడు నొకపుల్ల తెడ్డుగఁ గొని
ఒయ్యనొయ్యన గాలికి నొడ్డు జేరె.

24