పుట:మధుర గీతికలు.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చీమ, చిలుక


చీమ యొక్కటి నెలయేటి చెంత నున్న
తరువుకొమ్మల నెగఁబ్రాకి తిరుగుచుండె;
జోరు మని వీవ నంతట ఓరుగాలి,
కొమ్మపైనుండి అయ్యది కూలె నీట.

మునిఁగి తేలుచు, తేలుచు మునిఁగి యింక
ఈద జాలక యాచీమ యిట్టు లఱచె;
"ఏట మునుఁగుచునుంటి, న న్నెవ్వరైన
ఉద్ధరింపరె వేగమే యొడ్డు జేర్చి.”

చెట్టుకొమ్మపై కూర్చున్న చిలుక యొకటి
తోడనే కేక నాలించి, తొంగి చూచి,
"భయముపడకుము, చీమరో: భయముపడకు
చేతనై నట్టి సాయంబు చేయుదాన.”

23