పుట:మధుర గీతికలు.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


చెక్కు గీఱిన పాల్గొఱు చిఱుతనాఁడె
ఎంతకనికర మబ్బె నీహృదయమందు:"
అనుచు ఆతల్లి మాలతి నక్కు జేర్చి
మోవి మోవిని గదియించి ముద్దుగొనియె.

సిగ్గుచే చిన్నమాలతి శిరము వంచి
ఇట్టులనె “ఇంతమాత్రమె యెఱుఁగలేవె ?
నేలఁ బడినట్టిదానను నేనె గాన,
ఏల నవ్వుదు నను జూచి యేనె తల్లి"

22